ప్రమాదంలో రాజధాని- ప్రత్యామ్నాయ రాజధాని కర్నూలు

ప్రమాదంలో రాజధాని- ప్రత్యామ్నాయ రాజధాని కర్నూలు

రాష్ట్ర ప్రభుత్వం కర్నూలును రాష్ట్ర రాజధానిగా ప్రకటించాలి

రాయలసీమ రవికుమార్.రాష్ట్ర అధ్యక్షులు,ఆర్వీపీఎస్.

సుంకన్న మదాసికురువ
రాష్ట్ర అధ్యక్షులు.
ఆర్ హెచ్ పీఎస్.

కర్నూలు, న్యూస్ వెలుగు:శ్రీకృష్ణ కమిటీ,శివరామకృష్ణన్ కమిటీలు ముక్కారు పంటలు పండే అమరావతిలో రాజధాని కట్టవద్దని హెచ్చరించిన పెడచెవిన పెట్టిన ప్రభూత్వాలు నేడు వాస్తవ పరిస్థితులను చూస్తున్నారని రాయలసీమ విద్యార్థి పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు రాయలసీమ రవికుమార్, రాయలసీమ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు సుంకన్న అన్నారు నగరంలోని స్థానిక ఆర్వీపీఎస్ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అశోక్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో రాయలసీమ రవికుమార్,సుంకన్న మాట్లాడుతూ రాష్ట్ర రాజధాని ప్రాంతం తీవ్రమైన వరదలతో ప్రజలు అల్లాడిపోతున్నారని గతంలో శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీలు అమరావతిలో ముక్కారు పంటలు పండే భూములున్నాయని రాజధాని నిర్మాణం చేపడితే వరదలకు అవకాశాలున్నాయని నివేదికల ద్వారా హెచ్చరించిన కేంద్ర,రాష్ట్ర ప్రభూత్వాలు వాటిని ఏమాత్రం పట్టించుకోకుండా అమరావతిలో రాజధాని నిర్మాణం చేపట్టాయని కమిటీలు హెచ్చరించినట్టుగానే నేడు రాజధాని ప్రాంతం వదరలతో అల్లాడిపోతుందని ఈ పరిస్థితి రాష్ట్ర ప్రజలను రాయలసీమ వాసులను ఆవేదనకు గురిచేస్తోందని ప్రస్తుత పరిస్థితులే ఇలావుంటే భవిష్యత్తులో భారీవర్షాలు కురిస్తే ప్రాంతం మునకకు గురవ్వడమేగాక ప్రభూత్వాల నిర్లక్ష్యంతో ప్రాణనష్టం,ఆస్తి నష్టం,ఆర్థిక నష్టాలకు దారితీసే అవకాశాలు ఉన్నాయని అన్నారు.
ప్రమాధంలో ఉన్న రాజధానికి ప్రత్యామ్నాయ రాజధాని కర్నూలేనని కర్నూలు నగరానికి గతంలో 1953నుండి1956వరకు రాజధానిగా కొనసాగిన చారిత్రక నేపథ్యం ఉన్నదని కర్నూలులో ముప్పైవేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని,మానవ తప్పిదాలు తప్ప వరదలకు,తుఫానులకు గురయ్యే అవకాశాలు కర్నూలుకు ఏమాత్రం లేవని,భూమిలో పది అడుగులలోతు పునాధితో ఏమాత్రం ప్రమాదం లేనీ ఐదు అంతస్తుల భవనాలను నిర్మించవచ్చునని,రాష్ట్ర రాజధాని అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రకటించడం ద్వారా రాయలసీమ,కోస్తా, ఉత్తరాంధ్ర ప్రాంతాల సమాన అభివృద్ధికి అవకాశం ఉందని కావునా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఈ విషయాలను పరిగణనలోకి తీసుకుని శ్రీబాగ్ ఒడంబడికను గౌరవిస్తూ రాష్ట్ర రాజధానిని కర్నూలులో ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో వసంత్ కుమార్,విజయ్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!