ప్రాజెక్టుల మరమ్మత్తులు చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలి
సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్
జమ్మలమడుగు,న్యూస్ వెలుగు ;గత ప్రభుత్వ హాయంలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్టు తెగి భారీ స్థాయిలో ఆస్తి నష్టం ప్రాణ నష్టం జరిగిన ఘటన మరువక ముందే రాష్ట్రంలో ఇలాంటి విపత్తుల సంభవించడం చాలా బాధాకరమని అందుకు కారణం పాలకు ప్రభుత్వం అధికార యంత్రాంగమేనని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు స్థానిక జమ్మలమడుగు పట్టణంలోని రోడ్లు భవనాల అతిథి గృహం నందు ఆయన విలేకరుల సమావేశం లో మాట్లాడడం జరిగింది అన్నమయ్య ప్రాజెక్టు ఘటన మరువక ముందే తుంగభద్ర గేట్లు కొట్టుకపోవడం శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు రాకుండా ఫీజులు పోవడం ఇలా చూస్తుంటే ప్రాజెక్టులపై పాలక ప్రభుత్వం చిత్తశుద్ధి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు ప్రకాశం బ్యారేజీ గేట్లు బోట్లు ఢీకొట్టడం వలన గేటు డ్యామేజీ అయిన పరిస్థితి స్పష్టంగా కనబడతా ఉంది నేటి ప్రాజెక్టుల మెయిడ్నెన్స్ ఏ విధంగా ఉందో ప్రజలు గమనిస్తూ ఉన్నారని ఆయన అన్నారు శ్రీశైలం దిగువ నా పెద్ద గండిపడి ఎప్పుడైనా ప్రమాదం జరగవచ్చని నిపుణులు హెచ్చరించిన పాలక ప్రభుత్వాలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు విపత్తుల సంభవించినప్పుడు మాత్రమే వాటి పర్యవేక్షణ అప్పటికప్పుడు పూర్తి చేసి చేతులు దులుపుకోవడం తప్పితే రాబోయే విపత్తుల నుండి ప్రజలను కాపాడే పరిస్థితి పాలకవర్గాలకు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రాజెక్టు గండికోట. మైలవరం జలాశయం ప్రాజెక్టు కూడా మరమ్మతులు చేపట్టాల్సిన అవసరం ఉందని అనేకసార్లు అధికారులు దృష్టికి తీసుకుపోయిన వారి పట్టించుకునే పరిస్థితిలో లేరని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే పాలక ప్రభుత్వం అటు మొద్దు నిద్ర మాని వెంటనే ప్రాజెక్టుల మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జరిగినటువంటి ఆస్తి ప్రాణనష్టాల వారికి ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన పాలక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు గంగా సురేషు జమ్మలమడుగు కార్యదర్శి ప్రసాదు సిపిఐ నాయకులు లక్ష్మీనారాయణ నాగేంద్ర నవీన్ తదితరులు పాల్గొన్నారు.