ప్రాయశ్చిత్త దీక్షలో పాల్గొన్న భైరవ ప్రసాద్
శ్రీ సత్య సాయి జిల్లా న్యూస్ వెలుగు : కదిరి పట్టణంలోజనసేనపార్టీ కదిరి ఇంచార్జ్ భైరవ ప్రసాద్ ఆద్వర్యంలో నమో నాారాయణాయ మంత్ర పఠన కార్యక్రమం కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి లడ్డూ ప్రసాద నెయ్యి విషయంలో జరిగిన అపాచారాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా కదిరి పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర దేవస్థానం ప్రాంగణంలో నమో నారయణాయ మంత్ర పఠన కార్యక్రమం కదిరి జనసేన పార్టీ ఇంచార్జీ భైరవ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.

లౌకిక వాదం అంటే తన మతాన్ని కాపాడుకుంటూ, ఇతర మతాలనూ గౌరవించాలని, అంతేకానీ సనాతన ధర్మం ఆపదలో ఉన్నప్పుడు ఇతర మతాల వారు ఏమనుకుంటారో , ఓట్లు దూరం అవుతాయేమో,కాబట్టీ మాట్లాడకూడదని కాదనీ, ఏ మతానికి ఇబ్బంది కలిగిన మాట్లాడాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ కదిరి టౌన్ అద్యక్షులు చలపతి , నాయకులు రవికుమార్, చక్క రమణ,గవ్వల శ్రీనివాసులు, ప్రతాప్, రాజారాం, సోమశేఖర్,అంజిబాబు,గంగరాజు, నాగమణి, పులగంపల్లి రాజా,అంకాలప్ప , రామచంద్ర, పార్థసారథి తదితర నాయకులు కార్యకర్తలు,వీరమహిళాలు, అభిమానులు, భక్తులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

