
ఫిర్యాదులను తీసుకోవడమే కాదు వాటిని పరిస్కరిస్తాం : ఎమ్మెల్యే
కర్నూలు జిల్లా పత్తికొండ ఎమ్మెల్యే కెఈ శ్యామ్ బాబు తన నియోజకవర్గంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడం జరుగుతుందని వారు తెలిపారు. ప్రజలనుంచి ఫిర్యాదులను తీసుకోవడాని ప్రత్యేక ఏర్పాట్లను పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన అనేక ఫిర్యాదులను పరిస్కరించడం జరుగుతుందని మీడియాకు వెల్లడించారు. నియోజకవర్గంలో గత ప్రభుత్వ హయాంలో మొదలు పెట్టిన అనేక పథకాలను తిరిగి ప్రారంభించేందుకు చర్యలు చేయపట్టినట్లు తెలిపారు. ప్రజలకు సురక్షితమైన తాగునీరు, రోడ్లు వంటి అనేక కార్యక్రమాలను అమలు చేసే దిశగా చర్యలు తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎస్సీ సబ్ ప్లాన్ నిదులు ఏమయ్యాయో కూడా తెలియదన్నారు. TDP అధికారం లోకి వచ్చిన తరువాత అన్న క్యాంటీన్ , రైతులకు 9 గంటల విద్యుత్ , డ్రిప్ ఇరిగేషన్ వంటి పనులు మొదలు పెట్టినట్లు తెలిపారు. గతంలో అధికారంలో ఉన్న ఎమ్మెల్యే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాలంటే రోడ్లకు తట్టేడు మట్టికుడా వేయకుండా నిర్లక్ష్యం చేశారన్నారు.