
బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలి
కర్నూలు (న్యూస్ వెలుగు) : బర్త్ సర్టిఫికెట్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్న ఆసుపత్రి పై చర్యలు తీసుకోవాలని బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కుర్ని వెంకటేశ్వర్లు డిమాండ్. గురువారం DMHO జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం ఎదుట బిజెపి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. శ్రీ బాలాజీ యశోద నర్సింగ్ హోమ్ సంవత్సరం నుండి బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకుండా ఇబ్బందుల గురి చేస్తున్నారని తెలిపారు. మున్సిపల్ రికార్డులు ఆలస్యం చేయడం, ప్రజలను అవమానించడం,ఇబ్బందులకు గురి చేయడం చేస్తున్నారని తెలిపారు. యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ విషయమై పలుమార్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి చెప్పిన ఫలితం లేకుండా పోయిందన్నారు.
Was this helpful?
Thanks for your feedback!