
బస్టాండ్ లను ఆక్రమించిన పట్టించుకోని అధికారులు… ఇబ్బంది పడుతున్న ప్రయాణికులు
తుగ్గలి (న్యూస్ వెలుగు) : మా ఇష్టం మమ్మల్ని ఎవరు అడిగేది? మమ్మల్ని ఎవరు ఆపేది..? అచ్చం సినిమా డైలాగుల ఉంది కదూ…. వాస్తవాల్లోకి వెళితే ప్రభుత్వ ఆస్తుల్ని ఎంచక్కా అనుభవించేవారు కొందరైతే…. వాటిని ఆక్రమించే వారు మరికొందరు. ఆ భలే చెప్తున్నారు లెండి.. ప్రభుత్వ ఆస్తుల్ని ఆక్రమిస్తే అధికారులు ఊరుకుంటారా అంటే… మరి ఏం చేస్తారు అంటావ్.?.. ఎస్ కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్లను కొంతమంది ఆక్రమించగా మరికొందరు దర్జాగా వాడుకుంటున్న పరిస్థితి నెలకొంది దీనిపై ఇటు రెవెన్యూ అధికారులు కానీ అటు ఆర్టీసీ అధికారులు కానీ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దీనికి అసలు సమస్యగా మారిందని కొంతమంది వాపోతున్నారు. ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలులోకి వచ్చిన తర్వాత అనేక విషయాలను వెలుగులోకి వస్తున్నాయని విషయం అర్థమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బస్టాండ్లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించినప్పటికీ ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. జీరో ఫెయిర్ టికెట్ తో మహిళలకు టికెట్టును జారీచేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం వారికి సౌకర్యాలు కల్పించడంలో మాత్రం నిర్లక్ష్యం వహిస్తుందని మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. జీరో ఫెయిర్ టికెట్ కు ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యానికి ప్రభుత్వం డబ్బులు చెల్లించినప్పటికీ ఆర్టీసీ బస్టాండ్లలో సరైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని.. ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. తుగ్గలి మండలంలో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్లను కొంతమంది ఆక్రమించగా, మరికొన్ని బస్టాండ్లు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి…మరికొన్ని నిర్మానుషంగా మారాయి వీటిపై ప్రభుత్వ అధికారులు…ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏకంగా బస్టాండ్లను ఆక్రమించి యదేచ్చగా వాడుకుంటున్న పరిస్థితి మండలంలో నెలకొంది దీనిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది వేచి చూడాల్సి ఉంది.
