కర్నూలు న్యూస్ వెలుగు : వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా బహిరంగ ర్యాలీ ని జయప్రదం చేయాలని జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ జాకీర్ మౌలానా రష్ది పిలుపునిచ్చారు. మసీద్ ఏ రిసల్ దార్ ఆవరణలో మీడియా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ సయ్యద్ జాకీర్ మౌలానా రష్దీ ,కోకన్వీనర్లు ,ఎస్ ఎం డి షరీఫ్, ఎం ఎ హమీద్, జయరాజు లు మాట్లాడుతూ సోమవారం ఉదయం 9 గంటలకు సోమవారం ఇస్లామియా అరబ్బీ కాలేజ్ గ్రౌండ్ నుంచి ర్యాలీ శాంతియుతంగా ,సామరస్యంగా కొనసాగడానికి ముస్లిం యువకులతో పాటు, హిందూ ,క్రైస్తవ సోదరులు సహకరించాలని, పెద్ద ఎత్తున ఈ నిరసన ర్యాలీలో మీరందరూ రావాలని వారు పిలుపునిచ్చారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం తీసుకొని వచ్చిన నల్ల చట్టాన్ని రద్దు చేయాలని, తక్షణమే సవరణలు వెనక్కి తీసుకోవాలని పాత చట్టాన్ని కొనసాగించాలని ,కేంద్ర ప్రభుత్వన్నీ డిమాండ్ చేసారు.
Thanks for your feedback!