బాధితులను పరామర్శించిన మంత్రులు

బాధితులను పరామర్శించిన మంత్రులు

శ్రీకాకుళం జిల్లా (న్యూస్ వెలుగు ): కాశీబుగ్గలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో భక్తుల మధ్య తోపులాట జరిగిన ప్రాంతాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, హోంమంత్రి అనిత, ఎమ్మెల్యే గౌతుశిరీష , ఇతర ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించినట్లు మంత్రి నారాలోకేష్ తెలిపారు. కాశీబుగ్గ ప్రమాదంలో గాయపడి పలాస ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ , మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నయుడు, కొండపల్లి శ్రీనివాస్, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు , టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లశ్రీనివాస్ , ఎమ్మెల్యే గౌతుశిరీష తో కలిసి పరామర్శించడం జరిగిందని. గాయపడ్డ వారిని ప్రభుత్వాస్పత్రిలో అందుతున్న చికిత్సపై వివరాలు అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరడం జరిగిందని మంత్రి నారాలోకేష్. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి ధైర్యం చెప్పడం జరిగిందన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS