బాబు గారి పిట్టలదొర మాటలు!

బాబు గారి పిట్టలదొర మాటలు!

అమరావతి (న్యూస్ వెలుగు): మొంథా తుఫాన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రచారంపై వైసిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టెక్నాలజీ పేరుతో బాబు గారు బురిడీలు చేస్తున్నారని, రైతులకు రాష్ట్రవ్యాప్తంగా వేల ఎకరాలు పంట నీట మునిగి నష్టపోతే రైతులను ఆదుకోవాల్సింది పోయి మా మేనేజ్మెంట్ వల్లే పంట నష్టం ఆస్తి నష్టం తగ్గిందని బాబు గారు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఉచిత పంట బీమా రైతులకు కల్పించి ఉంటే వారికి ఆర్థిక భరోసా ఉండేదని, గత ప్రభుత్వ హయాంలో ఉచిత పంట బీమా ద్వారా 55 లక్షల మంది రైతులకు లబ్ధి పొందిందని అలాంటి పథకాలను కూటమి ప్రభుత్వం ఖూనీ చేసిందని మండిపడ్డారు. సీజన్ వారీగా ఇన్పుట్ సబ్సిడీలను ఇవ్వకుండా వేలకోట్ల రూపాయలను పెండింగ్లో ఉంచారని వారు విమర్శలు చేశారు. ఉచిత రైతు బీమా పథకాన్ని అమలు చేసి ఉంటే రైతులకు మేలు చేసి ఉండేదన్నారు అలాంటి పథకాలను కూటమి ప్రభుత్వం తుంగలో తొక్కడం హేయమైన చర్య అని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీలు, అన్నదాత సుఖీభవ పేరుతో ఏడాదికి 20,000 వేల చొప్పున ఇవ్వాల్సి ఉండగా ఇప్పటిదాకా కేవలం 5000 రూపాయలతో సరిపెట్టుకుందని, మిగతా 35వేల రూపాయలు ఎటు పోయాయో తెలియదని ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు.

Author

Was this helpful?

Thanks for your feedback!