బీజేపి పై నిప్పులు చెరిగిన ఏపి పీసీసీ

బీజేపి పై నిప్పులు చెరిగిన ఏపి పీసీసీ

అమరావతి : అంబేద్కర్‌పై కేంద్రమంత్రి అమిత్ ‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. గురువారం పార్లమెంటులో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనమని ఎపీ పిసిసి చీఫ్ షర్మిల అన్నారు  . బీజేపీ, ఆరెస్సెస్‌ ఎప్పుడూ అంబేద్కర్‌కు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు.  అందుకే అంబేద్కర్ జ్ఞాపకాలను చెరిపివేయాలని బిజెపి కోరుకుంటుదన్నారు. అమిత్ షాను రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.  కానీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీశారు. పార్లమెంట్ లోపలికి వెళ్తున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే , ప్రియాంక గాంధీ ని బీజేపీ ఎంపీలు అడ్డుకుని పక్కకు తోయడం వారి అహంకారానికి నిదర్శనమిదన్నారు . ఈ తోపులాటలో మల్లికార్జున ఖర్గే గారు కిందపడిపోయారు. సాక్షాత్తూ పార్లమెంట్ ఆవరణలోనే బీజేపీ ఎంపీలు రౌడీల్లా కర్రలు చేతబట్టి సభలోకి వెళ్లకుండా కాంగ్రెస్ ఎంపీలను అడ్డుకోవడం దారుణం. వారిలో వారే కొట్టుకుని రాహుల్ గాంధీ పై నింద మోపుతున్నారని విమర్శించారు. వారి ప్రవర్తన ప్రజాస్వామ్యానికి మాయని మచ్చగా నిలుస్తోందని చెప్పారు. అంబేద్కర్‌పై అమిత్ ‌షా చేసిన వ్యాఖ్యల వీడియోను డిలీట్‌ చేయాలంటూ ‘ఎక్స్‌’కు కేంద్రం నోటీసులు ఇవ్వడం చూస్తుంటే వారు తప్పు చేశారని అర్థమవుతోందన్నారు. అంబేద్కర్‌పై బీజేపీ అసలు ఆలోచనలు.. అమిత్‌షా వ్యాఖ్యల రూపంలో బయటపడ్డాయి. దేశానికి రాజ్యాంగాన్ని, కోట్లాది మంది దళితులు, అణగారినవర్గాల ప్రజల జీవితాలను మార్చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్‌ను బీజేపీ అనుక్షణం అవమానిస్తోంది. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పరిరక్షణకు కాంగ్రెస్ పార్టీ కాషాయం మూకపై పోరాటం చేస్తూనే ఉంటుంది.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS