
బ్యాంకర్లకు కీలక సూచనలు చేసిన కలెక్టర్
కర్నూలు (న్యూస్ వెలుగు) : పంట రుణాల మంజూరులో నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి బ్యాంక్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్ లో బ్యాంకర్ లకు సంబంధించిన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ, డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లా ఇండస్ట్రియల్ హబ్ గా రూపాంతరం చెందే అవకాశం ఎక్కువగా ఉందన్నారు. ఎంఎస్ఎంఈ లను ఎక్కువగా ప్రోత్సహించడంలో భాగంగా రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా మొదటి స్థానంలో ఉండే విధంగా ఎంఎస్ఎంఈ లోన్లు ఇప్పించడంలో పురోగతి తీసుకొని రావాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టర్మ్ లోన్లు ఇప్పించడంలో పురోగతి తక్కువగా ఉందని, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టర్మ్ లోన్లు కింద కోల్డ్ స్టోరేజ్, రూరల్ గోడౌన్ లాంటి ప్రతిపాదనలు ఏమైనా ఉంటే బ్యాంక్ అధికారులకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారిని ఆదేశించారు. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వారికి ఈ విషయాలను తెలియచేసి వారితో కోల్డ్ స్టోరేజ్, రూరల్ గోడౌన్ దరఖాస్తులు అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టర్మ్ లోన్ల కింద చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వ్యవసాయ అధికారిని ఆదేశించారు. సిసిఆర్సి కార్డు దారులకు రుణాలు ఇవ్వడంలో శ్రద్ధ వహించాలని కలెక్టర్ బ్యాంక్ అధికారులను ఆదేశించారు…పశు సంవర్థక శాఖ కి సంబంధించి లైవ్ స్టాక్ లోన్లు ఎక్కువ మందికి ఇప్పించే విధంగా చర్యలు తీసుకున్నట్లయితే జిడిపి, తలసరి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందన్నారు.
టిడ్ కో గృహాలను కూడా అని రకాల మౌలిక సదుపాయాలతో అభివృద్ధి, తల్లికి వందనం కి సంబంధించి తల్లుల ఖాతాలో జమ అయిన డబ్బులను బ్యాంకు వారు సంబంధిత లబ్ధిదారులకు గతంలో ఉన్న లోన్ కి సంబంధించి ఎటువంటి కటింగ్ లు చేయకూడదన్నారు.. కేంద్ర ప్రభుత్వ పథకాలైన స్టాండ్ అప్ ఇండియాలో ప్రతి బ్యాంక్ బ్రాంచ్ వారు నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని కలెక్టర్ సూచించారు. విద్యా రుణాల మంజూరు లో బ్యాంకర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రూరల్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ శిక్షణ కేంద్రం ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాల్లో భాగంగా శిక్షణతో పాటు ఉపాధి కల్పన కు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. దీని గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో డిఆర్ఓ సి. వెంకట నారాయణమ్మ, కెనరా బ్యాంక్ రీజినల్ మేనేజర్ సుశాంత్ కుమార్, ఎల్డీఎం రామచంద్ర రావు, నాబార్డ్ డిడిఎమ్ సుబ్బారెడ్డి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రామకృష్ణ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ నరసింహారావు, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, డి ఆర్ డి ఏ పిడి రమణ రెడ్డి, ఎస్సీ ఎస్టీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ రాజామహేంద్రనాథ్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.