
బ్రూనై పర్యటనలో ప్రధాని మోడీ
అంతర్జాతీయం : ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం బ్రూనై పర్యటనలో భాగంగా బందర్ సెరీ బెగావాన్‌లోని ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదును సందర్శించారు. ఈ పర్యటన భారతదేశం ,బ్రూనై మధ్య దౌత్య సంబంధాల 40వ వార్షికోత్సవం సందర్భంగా ఆగ్నేయాసియా దేశానికి భారత ప్రధాని చేసిన మొట్టమొదటి ద్వైపాక్షిక పర్యటన పీఎంఓ అధికారులు తెలిపారు. ప్రధాని మోడీకి అక్కడి అధికారులు స్వాగతం పలికినట్లు వెల్లడించారు. ఈ పర్యటన నేపథ్యంలో ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో, ముఖ్యంగా వాణిజ్య మరియు సాంస్కృతిక సంబంధాలు మెరుగు పడుతాయని ప్రధాని తెలిపారు.
Was this helpful?
Thanks for your feedback!