
భగవద్గీత మానవునికి ప్రబోధించిన కర్తవ్యబోధ:మాజీ మంత్రి
కర్నూలు న్యూస్ వెలుగు: మానవుడు నిజజీవితంలో అడుగడుగునా సరైన మార్గాన నడుచుటకు భగవద్గీత ఒక దీపస్థంభముగా తోడ్పడుతుందని, ప్రతివ్యక్తి భగవద్గీతను చదివి, ఆచరించాలని మాజీ రాజ్యసభ సభ్యులు, మాజీ మంత్రి టి. జి. వెంకటేశ్ అన్నారు. కర్నూలు నగరం, నర్సింగరావుపేటలోని శ్రీ గీతా ప్రచార ధామం నందు గీతా ప్రచార సంఘం ఆధ్వర్యంలో సమాజానికి ఉపయుక్తమయ్యే భగవద్గీత సూక్తులను ఆటోలకు అతికించారు. ఇంతటి మంచి సమాజ కార్యం చేస్తున్న గీతా ప్రచార ధామం నిర్వాహకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో డి.వి.రమణ, గోరంట్ల రమణ, జగన్నాథ గుప్తా, సింహాద్రి రమేష్, ఇల్లూరు రమణ, అవోపా నాగేశ్వరరావు, మహాబలేష్, నాగోజి, గోవిందరాజు, వివిధ ధార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

