మంట కలుస్తున్న మానవత్వం
పసి బిడ్డలపై అత్యాచారాలు
సతమతమవుతున్న తల్లిదండ్రులు
పసి నలుసుల పై దుర్మదాంధుల దాడులు
కఠిన చట్టాలు కఠిన శిక్షలూ
ఈ ఆకృత్యాలను అడ్డుకోలేకపోతున్నాయి..
అన్నదమ్ముల అనుబంధాలు
తండ్రి కొడుకుల ఆప్యాయతలు
ఆస్తి, డబ్బు ముందు…
దిగదుడుపు అవుతున్నాయి
తగాదాలతో మానవత్వాన్ని..
మంటగలుపుతున్నాయి.
అగ్నికి ఆజ్యం పోసినట్టు,
సమాజంలోని మనుషుల మాటలు
బంధాల మధ్య చిచ్చురేపుతున్నాయి.
పెరిగిన అపోహలు, తగ్గిన మానవత్వం,
మారిన ప్రజల బ్రతుకు చిత్రం
క్షణికావేశంలోనే హత్యలు
మనుషులను చంపే రాక్షస సంస్కృతి
రాను రాను రాజ్యమేలుతుంది.
మానవత్వం చితి మంటల్లో కాలిపోతుంది.
నది తన నీళ్ళతో దాహం
చెట్లు తన ఫలాలతో ఆకలి
సూర్య చంద్రులు తమ వెలుగుతో
పరోపకారం చేస్తూ ఉంటే,
మనిషి దురాలోచనలు,
మానవత్వాన్ని మంటగలుపుతున్నాయి.
దుంపాల వీరేష
తెలుగు భాషోపాధ్యాయులు
యస్.యం.కె.వి ప్ర.ఉ.పా. విద్యానగర్
మంత్రాలయం మండలం
కర్నూలు జిల్లా
చరవాణి : 9110544030.