
మంత్రులు తనిఖీలు చేయాలి : ముఖ్యమంత్రి చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు : మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లల్లో తనిఖీలను నిర్వహించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశించారు. సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్ స్కూళ్లల్లో పారిశుద్ధ్యం, తాగునీటి వసతిపై మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. టాయిలెట్లు, ఆర్వో ప్లాంట్లు ప్రతి హాస్టల్ లో ఉండాలని నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు డోలా బాల వీరాంజనేయ స్వామి, శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, పంచాయతీ రాజ్, వైద్యారోగ్య శాఖలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Was this helpful?
Thanks for your feedback!

