మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానున్న హైదరాబాద్‌.

మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానున్న హైదరాబాద్‌.

న్యూస్ వెలుగు ;   మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలకు తెలంగాణ వేదిక కానున్నది.

72వ మిస్‌ వరల్డ్‌ పోటీలను ఈ ఏడాది హైదరాబాద్‌లో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

నాలుగు వారాలపాటు జరిగే ఈ పోటీల ప్రారంభ, ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్‌ ఫినాలే కూడా హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారు.

ప్రతిష్ఠాత్మక మిస్‌ వరల్డ్‌ ఫెస్టివల్‌లో 120 కి పైగా దేశాలు పాల్గొననున్నాయి.

‘బ్యూటీ విత్‌ ఏ పర్పస్‌’ అనే లక్ష్యం తో జరిగే ఈ మిస్‌ వరల్డ్‌ అందాల పోటీలకు దేశవిదేశాల ప్రతినిధులకు తెలంగాణ స్వాగతం పలకబోతున్నది.

మే 7న ప్రారంభం కాగా, 31న గ్రాండ్‌ ఫినాలే ఉంటుంది.

Author

Was this helpful?

Thanks for your feedback!