హోళగుంద, న్యూస్ వెలుగు :మండల పరిధిలో దేవరగట్టు కొండ గుహలో వెలసిన శ్రీ మాళ సహిత మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు.అలాగే మండల కేంద్రంలో వెలసిన శ్రీ సిద్దేశ్వర స్వామి

ఆలయంలో బుధవారం అమావాస్య సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు.ఉదయం నుంచి స్వామివారికి జలాభిషేకం,పంచామృత అభిషేకం,బిల్వార్చన,ఆకుపూజ,దేవునికి పెద్ద ఎత్తున పూలమాలలతో అలంకరించారు.అలాగే దేవాలయాల్లో భక్తులు తమ మొక్కుబడులు తీర్చుకున్నారు.అదేవిధంగా ఎల్లార్తి హాజరత్ శేక్షవలి షాషావలి తాత,సద్గురు సాయిబన్న తాత దర్గలో భక్తులు ప్రత్యేక ఫాతేహల్ నిర్వహించారు.సమ్మతగేరి గ్రామంలో శ్రీ ఆదిపరాశక్తి మారెమ్మ దేవి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి.దేవాలయనీ కి వచ్చిన భక్తులకు ఆయా దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Thanks for your feedback!