మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం :సీఎం చంద్రబాబు నాయుడు 

మహిళల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం :సీఎం చంద్రబాబు నాయుడు 

న్యూస్ వెలుగు సచివాలయం: మహిళా సాధికారత సాధనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరచేందుకు అవకాశాలు ఉన్న అన్ని రంగాలను ఉపయోగించుకోవాలని సూచించారు. మంగళవారం సచివాలయంలో సెర్ప్, మెప్మా విభాగాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 8 రకాల సేవలు అందించే మెప్మా-మన మిత్ర యాప్‌ను ప్రారంభించారు. మెప్మా చేపట్టే కార్యకలాపాలను వివరిస్తూ రూపొందించిన అవని వార్షిక సంచికను, ప్రగ్న్యా యాప్‌ను కూడా ఆవిష్కరించారు. ఈ యాప్ ద్వారా మెప్మా సభ్యులకు వర్చువల్ ట్రైనింగ్ అందిస్తారు. అలాగే రూ.1.25 కోట్ల బ్యాంక్ రుణం పొంది వ్యాపారం చేస్తున్న మంగళగిరికి చెందిన మహిళను సీఎం అభినందించారు. ఈ సమీక్షలో వర్చువల్‌గా మంత్రులు పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, సెర్ప్, మెప్మా అధికారులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS