
మహిళల భద్రత కోసం షీ-బాక్స్ పోర్టల్
న్యూఢిల్లీ,న్యూస్ వెలుగు : పని ప్రదేశాల్లో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ-బాక్స్ (SHe-Box) పోర్టల్‌ను ప్రారంభించింది. దీనిని కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంటర్నల్ కమిటీలు, స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం దీనిలో ఉంటుందని ఈ మంత్రిత్వ శాఖ తెలిపింది.
బాధితురాళ్లు ఈ పోర్టల్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు, దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదో తెలుసుకోవచ్చు, సకాలంలో తమ సమస్యల పరిష్కారం జరిగేలా చేయవచ్చు. పని చేసే చోట జరిగే లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి సమగ్ర వేదికగా ఇది పని చేస్తుందని అన్నపూర్ణ దేవి చెప్పారు.
Was this helpful?
Thanks for your feedback!