మానవ శరీర అంతర్గత నిర్మాణాల పనితీరు తెలిపేదే ఫిజియాలజీ : డాక్టర్ కే చిట్టి నరసమ్మ

మానవ శరీర అంతర్గత నిర్మాణాల పనితీరు తెలిపేదే ఫిజియాలజీ : డాక్టర్ కే చిట్టి నరసమ్మ

కర్నూలు న్యూస్ వెలుగు : మానవ శరీరంలోని అంతర్గత నిర్మాణాల పనితీరు  ఆరోగ్యంగా ఉంటే మనిషి రోగాలకు దూరంగా ఉండి పనిచేయగలుగుతాడని అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కర్నూల్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ అన్నారు. శుక్రవారం కర్నూల్ మెడికల్ కాలేజీ యందలి ఫిజియాలజీ విభాగం యందు ఈ నెల 17వ తేదీ నుండి 21 వరకు నిర్వహిస్తున్న ఫిజియాలజీ వారోత్సవాల ముగింపు సందర్భంగా న్యు లెక్చరర్ గ్యాలరీలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ. ప్రతి వైద్య విద్యార్థి శరీర అంతర్గత భాగాల నిర్మాణం వాటి పనితీరు ప్రభావితమయ్యే అంశాలపై పూర్తిగా అవగాహన పెంచుకోవాలని అంటే ఫిజియాలజీ పై పట్టు సాధిస్తే అనాటమీ ఫార్మకాలజీ మైక్రోబయాలజీ పెథాలజీ మెడిసిన్ తోపాటు అన్ని క్లినికల్ విభాగాల్లో రాణించగలుగుతారని తద్వారా వైద్య విద్యలో మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న మైపర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అంతర్గత ఆరోగ్యం తో పాటు మానవ శారీరము బయటి పరిస్థితులు కూడా అనుకూలంగా వుంటే మనిషి సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలరని అన్నారు. ఫిజియాలజీలో కణ నిర్మాణం శరీర భాగాల నిర్మాణం పనితీరుపై అధ్యయనం చేయడం ద్వారా కొత్త వ్యాధులపై నిరంతర నిఘా కొనసాగించ వచ్చునని తెలిపారు. ఫిజియాలజీ విభాధిపతి ప్రొఫెసర్ సుధారాణి మాట్లాడుతూ ఈనెల 17 నుండి ఫిజియాలజీ వారోత్సవాల సందర్భంగా ఈ పోస్టర్ ప్రజెంటేషన్, విద్యార్థులకు క్విజ్ ప్రోగ్రామ్స్, విద్యార్థులకు ఫిజియాలజిపై అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగిందని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ఫిజియాలజిపై వివిధ విభాగాల్లో పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు తెలిపారు. మొట్ట మొదటి ఫిజియాలజి విభాగాధిపతి ఫౌండర్ ఆఫ్ కె.యం.సి డా . వెంకట రామయ్య గారి విగ్రహనికి పూలమాల వేసి వారి సేవలు కొనియాడారు.. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ లు డా. సాయి సుధీర్ డా. విజయ్ ఆనంద్ బాబు, డా. సింధియా శుభప్రద, ఫిజియాలజీ విభాగపు అసోసియేట్ ప్రొఫెసర్ డా.రాధిక, డా.ఎలిజబెత్, డా.లక్ష్మి అసిస్టెంట్ ప్రొఫెసర్ లు డా. ఉమామహేశ్వరి డా. తులసి డా. సురేష్ పీజీ లు , సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS