
మోంథా తుఫాన్ బీభత్సంతో నష్టపోయిన రైతుని ప్రభుత్వం ఆదుకోవాలి : వైఎస్ జగన్
కృష్ణా జిల్లా (న్యూస్ వెలుగు) : జిల్లాలో మోంథా తుఫాన్ బీభత్సంతో పంట నష్టపోయిన రైతుల కష్టాల్ని తెలుసుకుని.. వారికి న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుఫానుల వల్ల రైతులు తీవ్రస్థాయిలో నష్టపోతే రైతులకు ఉచిత పంట బీమా అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని వారు మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి సరైన పద్ధతి కాదని తక్షణమే రైతులకు ఇన్పుట్ సబ్సిడీ నష్టపోయిన రైతులకు పంట నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు లేని పక్షంలో రైతుల కోసం ఎలాంటి పోరాటాలు చేయడానికి అయినా వెనుకాడ భూమిని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తుఫాను ప్రభావం వల్ల పెద్ద ఎత్తున రైతులు నష్టపోతే ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులను చిన్నచూపు చూసేలా వ్యవహరిస్తున్నారని రైతులకు తీవ్ర నష్టం జరిగిందన్నది కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుందన్నారు. రైతులకు ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ పంట బీమా అమలు చేసి రైతులకు చేదోడుగా నిలవాలని అన్నారు.

