యోగ ఫెడరేషన్ డైరెక్టర్ గా అవినాష్ శెట్టి నియామకం

యోగ ఫెడరేషన్ డైరెక్టర్ గా అవినాష్ శెట్టి నియామకం

కర్నూలు (న్యూస్ వెలుగు) : ఇంటర్నేషనల్ యోగ ఫెడరేషన్ డైరెక్టర్ గా కర్నూలు జిల్లా యోగా సంఘం అధ్యక్షుడు అవినాష్ శెట్టిని భారతదేశ నుంచి నియమిస్తూ యోగా ఫెడరేషన్ ఆఫ్ ఏషియా అధ్యక్షుడు డాక్టర్ రాధాకృష్ణ,అంతర్జాతీయ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు ధర్మాచారి మైత్రానంద గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.2025 నుంచి 2028 అవినాష్ శెట్టి ఈ పదవీలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.అవినాష్ శెట్టి నియామకం పట్ల రాష్ట్ర యోగ సంఘం చైర్మన్ లక్ష్మీకాంత్ రెడ్డి,కర్నూలు జిల్లా హ్యాండ్ బాల్ సంఘం కార్యదర్శి రుద్ర రెడ్డి, కర్నూలు జిల్లా యోగ సంఘం కార్యదర్శి మునిస్వామి,సభ్యులు సాయి కృష్ణ,శశిధర్,డాక్టర్ ముంతాజ్ బేగం, శ్రీనివాసులు,జిల్లా ఒలంపిక్ సంఘం నాయకులు,రాష్ట్ర యోగ సంఘం సభ్యులు హర్షం వ్యక్తం చేశారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!