
రాజధాని రైతుల సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి : సిఎం చంద్రబాబు
అమరావతి న్యూస్ వెలుగు : రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సూచించారు. సీఆర్డీఏ పై సచివాలయంలో గురువారం సమీక్ష నిర్వహించారు. భూములు త్యాగం చేసి ప్రభుత్వానికి సహకరించిన రైతులకు ప్రభుత్వం తరపున అదే స్థాయి సహకారం అందాలని అన్నారు. రాజధానిలో నిర్మాణాలు వేగంగా పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఈ సమీక్షకు పురపాలక శాఖ మంత్రి శ్రీ పి.నారాయణ, సీఆర్డీఏ, పురపాలక శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Was this helpful?
Thanks for your feedback!

