
రాతనలో సీజనల్ హాస్టల్ ప్రారంభించిన ఎంఈవో
తుగ్గలి (న్యూస్ వెలుగు): కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకా తుగ్గలి మండలంలో పరిధిలోని రాతన గ్రామంలో పత్తికొండ శాసన సభ్యులు కె యి శ్యాం కుమార్ ఆదేశాల మేరకు శనివారం రాతన గ్రామంలో తుగ్గలి మండల విద్యాధికారి ఈ. రామ వెంకటేశ్వర్లు మరియు రాతన పాఠశాల హెడ్మాస్టర్ లు సంయుక్తంగా సీజనల్ హాస్టల్ ను ప్రారంభించారు.ఈ సందర్బంగా మండల విద్యాధికారి రామ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మండలంలోని గ్రామాల్లోని పేద విద్యార్థులు తల్లి దండ్రులు కాలానుగుణంగా వలసబాట వెళుతున్న తరుణంలో విద్యార్థుల తల్లి దండ్రులు వారితో పాటు విద్యార్థులను కూడా వలసకు తీసుకు వెళుతుంటారు కాబట్టి అలా జరుగకుండా విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోను విద్యకు దూరం కాకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యకు ప్రాదాన్యత కల్పించి గ్రామీనా ప్రాంతాల్లో వలస వెల్లె కుటుంబాల్లోని విద్యార్థులకు విద్యను అందించేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నధని అందుకు సీజనల్ హాస్టల్స్ నిర్వాహకులు సక్రమంగా ఉపయోగించుకోగలరని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

