రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు

రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు

Delhi (ఢిల్లీ ): రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధ్యక్షతన నేటి నుంచి రాష్ట్రపతి భవన్‌లో రెండు రోజుల గవర్నర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రపతి కార్యాలయ అధికారులు వెల్లడించారు.  ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేసినట్లు తెలిపారు. రాష్ట్రపతి అధ్యక్షతన జరగనున్న తొలి గవర్నర్ల సమావేశమని కార్యాలయ అధికారులు తెలిపారు.

ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల గవర్నర్లు హాజరుకానున్నారు. ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్‌ఖర్, ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, ధర్మేంద్ర ప్రధాన్, శివరాజ్ సింగ్ చౌహాన్, అశ్విని వైష్ణవ్, డాక్టర్ మన్సుఖ్ మాండవ్యతో సహా పలువురు కేంద్రమంత్రులు కూడా సదస్సుకు హాజరుకానున్నారు.

నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌, సీఈవోతో పాటు పీఎంఓ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని క్యాబినెట్‌ సెక్రటేరియట్‌లోని ఇతర సీనియర్‌ అధికారులు కూడా పాల్గొంటాని రాష్ట్రపతి కార్యాలయం వెల్లడించింది.  దేశంలో తెచ్చిన నూతన న్యాయచట్టాల అమలు , ఉన్నత విద్యలో సంస్కరణలు, యూనివర్సిటీల గుర్తింపు  ఈ సదస్సులో  ఎజెండాగ ఉన్నాయని  రాష్ట్రంలోని వివిధ కేంద్ర సంస్థల మధ్య మెరుగైన సమన్వయంతో సహా అనేక  అంశాలు కూడా చర్చించనున్నట్లు అధికారికంగా తెలిపారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS