
రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన తుగ్గలి హై స్కూల్ విద్యార్థులు
తుగ్గలి (న్యూస్ వెలుగు): జిల్లాస్థాయి ఎస్జిఎఫ్ గేమ్స్ నందు ఖోఖో పోటీల సెలక్షన్ నందు తుగ్గలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు చందు నాయక్ తెలియజేశారు.7వ తేదీన నంద్యాల నందు జరిగిన ఖోఖో పోటీలలో విద్యార్థులు ప్రతిభను కనబరిచి జిల్లా స్థాయి నుండి రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని,అండర్ 17 విభాగంలో రంజిత్,పవన్,అరుణ్,పవిత్ర లు ఎంపికయ్యారని,అండర్ 14 విభాగంలో కార్తీక్,రేణుక లు ఆత్మకూరు నందు జరిగే క్యాంపుకు క్రీడాకారులు హాజరవుతారని చందు నాయక్ తెలియజేశారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయులు అగస్టీన్, ఉపాధ్యాయులు సుధాకర్,శీను,రంగా, చాంద్ బాషా,సుంకన్న,నారాయణ, సౌభాగ్య తదితర ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించారు.
Was this helpful?
Thanks for your feedback!

