
రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు
కర్నూలు (న్యూస్ వెలుగు): రాష్ట్ర స్థాయి డ్రాగన్ బోటు ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సంఘం కార్యదర్శి మంచికంటి అవినాష్ శెట్టి ఒక ప్రకటనలో తెలిపారు.ఎంపిక పోటీలు సీనియర్ స్త్రీ, పురుషుల విభాగం,అండర్-23 బాల బాలికల విభాగం,పార విభాగంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీలు అక్టోబర్ 26 నుంచి గార్గేయపురం సిటీ ఫారెస్ట్ చెరువు వద్ద ఉదయం ఏడు గంటలకు ప్రారంభిస్తామని తెలిపారు. ఎంపికైన క్రీడాకారులు డ్రాగన్ బోట్ ఇండియా అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నవంబర్ 24 నుంచి 27 వరకు మహారాష్ట్ర రాష్ట్రంలోని నాందేడ్ లో జరగబోయే 12 వ జాతీయ స్థాయి డ్రాగన్ బోట్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని తెలిపారు.ఎంపిక పోటీలకు హాజరయ్యే క్రీడాకారులు రూ.100 ప్రవేశ రుసుముతో నేరుగా హాజరు కావాలని తెలిపారు.వివరాలకు 8143084479 నంబర్ ను సంప్రదించాలని పేర్కొన్నారు.
