
రాహుల్ గాంధీకి మద్దతుగా సంతకాల సేకరణ
కర్నూలు (న్యూస్ వెలుగు): జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సమావేశమునకు ముఖ్య అతిథులుగా హాజరైన గణేష్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ దేశంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతుందని 11 సంవత్సరముల బీజేపీ పాలనలో దేశ ప్రజలు జీఎస్టీ పేరుతో పన్నుల భారంతో విసిగిపోయారని ప్రధాని మోదీ బీహార్ ఎన్నికల సందర్భంగా ప్రజలకు జీఎస్టీ తగ్గించామని తాయిలాలు వేస్తున్నారని ఇలాంటి వారిని ప్రజలు నమ్మరని జాతీయ కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో దేశ ప్రజల కష్టాలు తెలుసుకున్నారన్నారు.
బిజెపి చేస్తున్న దొంగ ఓట్ల కుట్రలను రాహుల్ గాంధీ బయటపెట్టారని ప్రజలు అన్నీ గమనిస్తూ బిజెపిని సాగనంపి కాంగ్రెస్ పాలన కోరుకుంటున్నారని గణేష్ కుమార్ తెలియజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే, ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ మస్తాన్ వలి మాట్లాడుతూ బిజెపి ఓట్ల దొంగతనం బయటకు తీసిన రాహుల్ గాంధీ కి మద్దతుగా ఓట్ల దొంగ గద్దె దిగు అను నినాదంతో సంతకాల సేకరణ చేపట్టాలని మరియు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయని ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాజ్యాంగాన్ని అవమాన పరుస్తున్నారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై కుట్రపూరిత దాడి జరిగిందని ఎన్డీఏ పాలన బ్రిటీష్ పాలనను తలపిస్తుందని రాహుల్ గాంధీ పై 33 కేసులు కుట్రపూరితంగా పెట్టారని దేశ ప్రజలకు తోడుగా రాహుల్ గాంధీ ఉన్నారన్నారు. దొంగ ఓట్ల పై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటానికి మనమందరం మద్దతుగా నిలిచి సంతకాల సేకరణ చేపట్టి పూర్తి చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు మస్తాన్ వలి పిలుపునిచ్చారు.

అనంతరం సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు షేక్ జిలాని భాష ఆధ్వర్యంలో స్థానిక పెద్ద మార్కెట్ ప్రాంతంలో రాహుల్ గాంధీ కి మద్దతుగా సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో నంద్యాల డిసిసి అధ్యక్షులు, ఎఐసిసి మెంబర్ కర్నూలు జిల్లా ఇన్చార్జి జే లక్ష్మీనరసింహ యాదవ్, మాజీమంత్రి మూలింటి మారెప్ప, మాజీ ఎమ్మెల్సీ, ఏఐసీసీ సభ్యులు ఎం సుధాకర్ బాబు, యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి ఎం నాగ మధు యాదవ్, మాజీ డిసిసి అధ్యక్షులు కే బాబురావు, నియోజక వర్గాల కోఆర్డినేటర్లు యం ఖాసిం వలి, బి క్రాంతి నాయుడు, రమేష్ యాదవ్, అనంత రత్నం మాదిగ,ఓబిసి రాష్ట్ర కోఆర్డినేటర్ దేవిశెట్టి ప్రకాష్, మైనార్టీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ నూర్, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణ,ఐ ఎన్ టి యు సి ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ ఖాద్రి భాష, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు బి బతుకన్న, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎన్సి బజారన్న, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బి మహేంద్ర నాయుడు, మైనార్టీ సెల్ జిల్లా చైర్మన్ షేక్ ఖాజా హుస్సేన్, ఓబీసీ సెల్ చైర్మన్ డివి సాంబశివుడు, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు ఏ సూర్య ప్రకాష్ రెడ్డి, ఎస్టీ సెల్ జిల్లా చైర్మన్ వై మారుతీ రావు, ఎన్ ఎస్ యు ఐ జిల్లా అధ్యక్షులు వీరేష్ యాదవ్, మార్కెట్ యార్డ్ మాజీ వైస్ చైర్మన్ కే రాఘవేందర్ రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమన్, ప్రధాన కార్యదర్శి రజాక్ వలి ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షులు ఈ లాజరస్, సిటీ ఎస్సీ సెల్ డబ్ల్యూ సత్యరాజు కాంగ్రెస్ నాయకులు రియాజుద్దీన్, మైనార్టీ సెల్ సిటీ అధ్యక్షులు అబ్దుల్ హై, షేక్ మాలిక్ భాష, బి సుబ్రహ్మణ్యం, శ్రీనిద్ రాయల్, దేవిశెట్టి వీరేష్, గోవర్ధన్ రెడ్డి మల్లేష్, సిటీ ఐఎన్ టియుసి అధ్యక్షులు ఆర్ ప్రతాప్ మండల కాంగ్రెస్ అధ్యక్షురాలు బి హైమావతి మొదలగు మండల కాంగ్రెస్ అధ్యక్షులు నియోజకవర్గాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.