
రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఎన్నిక సంఘం సమాధానం ఇవ్వాలి : గార్లపాటి మద్దిలేటి స్వామి
న్యూస్ వెలుగు డోన్: ఢిల్లీ లో లోకసభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ని, ఏం పి ప్రియాంక గాంధీని, మరియు ఇండియా కూటమి నాయకులు ఈ రోజు ఢిల్లీ లో ఎన్నికల కమిషన్ డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వాలని, ఓటర్ జాబితా తప్పుల తడకతో ఉందని, దాన్ని సరి చేయాలనీ ధర్నా చేస్తున్న నాయకులను అరెస్ట్ చేయడం దారుణమని, కాంగ్రెస్ పార్టీ డోన్ నియోజకవర్గం ఇంచార్జి డాక్టర్ గార్లపాటి మద్దులేటీ స్వామి కండించారు. నంద్యాల డిసిసి ఉపాధ్యక్షులు ఉన్నిగొర్ల జనార్దన్ మాట్లాడుతూ ఎన్నిక సంఘం రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహించడం బాధాకరం అన్నారు. ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు. అనేది పునాది లాంటిదని, అలాంటి ఓటు ను ఎన్నికల కమిషన్ విలువ లేకుండా ఓటర్ జాబితాను విచ్చలవిడిగా నకిలీ ఓట్లతో, డబుల్ ఓట్లతో, తయారు చేసి బీజేపీ గెలుపు కు సహకరించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమే నని వారు ఆరోపించారు.
ఈ దేశములో సమానత్వం కనిపించేది ఒక ఓటు మాత్రమే..,కల్పిస్తుందని,ఒక పూట కూడా తిండి దొరకని పేదవాడికైనా, లక్షల కోట్లు ఉన్న ధనవంతుడికైనా ఓటు దగ్గర సమానమే అని- ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల కమిషన్ బిజెపికి కాపు కాస్తున్నదని డోన్ నియోజకవర్గం ఇంచార్జి మద్దిలేటి స్వామి అగ్రహించారు. రాహుల్ గాంధీ అడిగిన, న్యాయభద్ధమైన ప్రశ్నలకు ఎన్నిక సంఘం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు ఈసీ సమాధానం ఇవ్వాలన్నారు.
*డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు ?*
*సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనం చేశారు ?*
*నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారు అయింది ?*
*ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు ?*
ఈ ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక అరెస్ట్ లు చేస్తారా? ఈ పరిణామాలు చూస్తూ ఉంటే ఎన్నికల కమిషన్, బీజేపీ ఒకటై ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాలరాస్తున్నారని, వారు విమర్శించారు. ఈ కార్యక్రమం లో డోన్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త డాక్టర్ గార్లపాటి మద్దిలేటి స్వామి, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు జనార్ధన్,డోన్ మండల అధ్యక్షులు పఠాన్ మహబూబ్ హుస్సేన్, పట్టణ అధ్యక్షులు వై. శేఖర్, ప్యాపీలి మండల అధ్యక్షులు శనగల మహేంద్ర నాయుడు, డిసిసి కార్యదర్శి మధు సూదన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.