రేపు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం

రేపు ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమం

Sekకర్నూలు (న్యూస్ వెలుగు): నగర పరిధిలో ప్రజల సమస్యలను నేరుగా విని పరిష్కరించేందుకు గురువారం ‘డయల్ యువర్ కమిషనర్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిషనర్ పి.విశ్వనాథ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 09:00 గంటల నుండి 10:00 గంటల వరకు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, నగర ప్రజలు తమ కాలనీల్లో స్థానిక సమస్యలను ఫోన్ ద్వారా నేరుగా తెలియజేయవచ్చని సూచించారు. తాగునీటి సమస్యలు, వీధి దీపాల మరమ్మతులు, రహదారుల మరమ్మతులు, పారిశుద్ధ్య సమస్యలు, ఇతర మౌలిక సదుపాయాలకు సంబంధించిన సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఫోన్ నెంబర్ 08518–221847 కు కాల్ చేసి తమ సమస్యలకు పరిష్కారం పొందవచ్చని, ప్రజలు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!