రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్

రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలి : కలెక్టర్

కర్నూలు, నవంబర్ 21 న్యూస్ వెలుగు :  డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని, రోగుల నుండి డబ్బు వసూలు చేస్తే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలను హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్టీఆర్ వైద్య సేవకు సంబంధించి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు ఉచితంగా వైద్యం అందించే పథకమని, రోగుల నుండి డబ్బు తీసుకోవడం సముచితం కాదని కలెక్టర్ తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగులకు మానవతా దృక్పథంతో వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.. ఎన్టీఆర్ వైద్య సేవ కింద రోగుల నుండి డబ్బులు తీసుకుంటున్నట్లు ఐవిఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి 11 ఫిర్యాదులు అందాయన్నారు… ఇకపై ఇలా జరగకూడదని, ప్రజల నుండి ఫిర్యాదులు రాకుండా రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ ఆసుపత్రుల యాజమాన్యాలను ఆదేశించారు.. ప్రైవేట్ ఆసుపత్రులలో స్టాఫ్ కూడా రోగుల నుండి డబ్బులు వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ప్రైవేట్ ఆసుపత్రి నుండి చివరి నిమిషంలో గవర్నమెంట్ హాస్పిటల్ లకు పంపిస్తున్నారని, దీనివల్ల ప్రభుత్వాసుపత్రిలో మరణాల సంఖ్య పెరుగుతోందని, ఇలా చేయకుండా మంచి వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. సిహెచ్సి, ఏరియా హాస్పిటల్ లలో కూడా ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఇన్ పేషెంట్ కేసులు ఎక్కువ సంఖ్యలో చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.సమావేశంలో ఆరోగ్యశ్రీ కో-ఆర్డినేటర్ డా. భాస్కర్ రెడ్డి, డిసిహెచ్ఎస్ డా.జఫ్రుల్లా , డిఎంహెచ్వో డా.భాస్కర్, GGH సూపరింటెండెంట్ డా.వెంకటేశ్వర్లు, ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS