
లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి: సీఎం
ఏపీ సచివాలయం (న్యూస్ వెలుగు ): మొంథా తుఫాను ప్రభావంపై లంక గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం అధికారులను ఆదేశించారు. తాజా పరిస్థితిపై మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించినట్లు తెలిపారు. ప్రాణనష్టం లేకుండా, ఆస్తినష్టం ఎక్కువ జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. పునరావాస శిబిరాల్లో ఉండేవారికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని నిర్దేశించారు. తుఫాన్ ప్రభావిత జిల్లా కలెక్టర్లు ప్రతి గంటకూ తుఫాన్ బులెటిన్ రిలీజ్ చేయాలని, మీడియాకు వాస్తవ పరిస్థితిని వివరించాలని, తప్పుడు సమాచారంతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వార్తలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కోరారు.
Was this helpful?
Thanks for your feedback!

