
లక్ష్మీనారాయణ హత్య విచారం వ్యక్తం చేసిన క్రాంతి నాయుడు
పత్తికొండ న్యూస్ వెలుగు : చిప్పగిరి లో లక్ష్మీ నారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులకు అండగా నిలుస్తాం అని తెలియజేసి, ధైర్యం చెప్పడం జరిగింది. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ చిప్పగిరి లక్ష్మీనారాయణ గారి పాశవిక హత్య గురించి తెలిసి గాఢమైన దిగ్భ్రాంతి చెందుతున్నాను. కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ఆలూరు నియోజకవర్గానికి అతడు చేసిన సేవలు మరువలేనివి. పార్టీకి నిబద్ధత గల నాయకుడిని కోల్పోవడం తీరనిలోటు. ఈ సందర్భంగా మృతుడి కుటుంబానికి, బంధువులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని అన్నారు. ఈ దారుణ ఘటనకు కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేసి, చట్టపరంగా కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాను. న్యాయం అందించే వరకు కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని వదిలిపెట్టదని స్పష్టంగా హెచ్చరిస్తున్నాము అని అన్నారు. లక్ష్మీనారాయణ గారు పార్టీలో అండగా నిలిచిన నాయకుడిగా మాత్రమే కాకుండా, సమాజానికి కూడా మద్దతుగా నిలిచారు. ఈ సందర్బంగా, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు సంఘటన స్థలాన్ని సందర్శించి మృతుడి కుటుంబానికి సంతాపం తెలియజేశారు. లక్ష్మీనారాయణ గారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి దేవుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను అని అన్నారు. కార్యక్రమంలో నంద్యాల డీసీసీ అధ్యక్షులు లక్ష్మి నరసింహ, కర్నూలు సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ జిలానీ భాష, ఉభయ జిల్లాల నియోజకవర్గ ఇంచర్జీలు పాల్గొనడం జరిగింది.