లాక్రోస్ ఆట అవగాహన సదస్సును ప్రారంభించిన డి.ఎస్.పి మహబూబ్ భాషా

లాక్రోస్ ఆట అవగాహన సదస్సును ప్రారంభించిన డి.ఎస్.పి మహబూబ్ భాషా

న్యూస్ వెలుగు కర్నూలు:  కర్నూలు  ఆదర్శ విద్యా మందిర్ హై స్కూల్ ల్లో  విద్యార్థిని విద్యార్థులతో లాక్రోస్ ఆట పై అవగాహన సదస్సును నిర్వహించినట్లు అసోసియేషన్ అధ్యక్షులు హరికిషన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా  డిఎస్పి మహబూబ్ బాషా విచ్చేసి ఆటల వలన విద్యార్థులు చురుకుగా తమ చదువులలో రాణించగలరని ప్రతి ఒక విద్యార్థి ఈ లాక్రోస్ ఆట గొప్పతనం మరియు ఒలంపిక్స్ లో 2028 సంవత్సరం నాటికి భారతదేశం పోటీ పడాలని లక్ష్యంతో లాక్రోస్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా చురుకుగా పని చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా లాక్రోస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ బి. హరికిషన్ మాట్లాడుతూ ఆటల పట్ల ప్రతి ఒక్క విద్యార్థి శ్రద్ధగా క్రమశిక్షణతో రాణించాలని కొనియాడారు. కర్నూలు జిల్లా లాక్రోస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ ఎన్. వజ్ర రాజు ఈ రెండు రోజుల కార్యక్రమమును వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ మేనేజర్ పి నూర్ భాషా, కడప జిల్లా లాక్రోస్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అనిల్ మాట్లాడుతూ విద్యా మందిర్ హై స్కూల్ క్రీడాకారులకు ఆదర్శంగా నిలుస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం లో అసోసియేషన్ సభ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!