వందేమాతర గేయం స్వాతంత్ర సమరానికి ప్రేరణ: కలెక్టర్

వందేమాతర గేయం స్వాతంత్ర సమరానికి ప్రేరణ: కలెక్టర్

కర్నూలు (న్యూస్ వెలుగు): వందేమాతరం150 ఏళ్ల సంస్మరణోత్సవంను పురస్కరించుకొని కర్నూలు లో కొండారెడ్డి బురుజు వద్ద వందేమాతర గీతం ఆలాపన కార్యక్రమము నిర్వహించటం జరిగినది. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ డాక్టర్. ఎ. సిరి మాట్లాడుతూ వందేమాతర గీతం భారత ఆత్మను ప్రతిబింబించిన నినాదం అని,అది ఒక జాతిని మేల్కొలిపిన శక్తి అని తెలిపారు.వందేమాతరం స్వాతంత్ర్య ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చి, సామాన్యులను సమరయోధులుగా మార్చిందని,ఈ పాట భారత మాత స్ఫూర్తిని ప్రతిబింబిస్తుందని, భారత ప్రజల ఐక్యతను, వైవిధ్యాన్ని జరుపుకుంటుందని తెలిపారు.భారత స్వాతంత్ర్య సమరానికి ప్రేరణనిచ్చిన వందేమాతరం గేయం ఈ రోజు 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోందని బంకించంద్ర ఛటర్జీ 1875 నవంబర్ 7న ఈ గేయాన్ని రచించారని తెలిపారు.

ప్రతి ఒక్కరు జాతీయత భావాన్ని పెంపోందించుకొని దేశాభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, సెట్కూరు సీఈవో డాక్టర్ వేణుగోపాల్ , జిల్లా విద్యాశాఖ అధికారి శామ్యూల్ పాల్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ అనూరాధ, ఆర్ ఐ ఓ లాలప్ప , మున్సిపల్ కమిషనర్ కార్యాలయ సిబ్బంది , ఎన్ సి సి విద్యార్థులు, స్కౌట్స్ అండ్ గైడ్ విద్యార్థులు,ఎన్ ఎస్ ఎస్ విద్యార్థులు, వివిధ విద్యాసంస్థల విద్యార్థులు, ప్రజలు పాల్గొనడం జరిగినది.

Authors

Was this helpful?

Thanks for your feedback!