వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

వరి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

హొలగుంద (న్యూస్ వెలుగు) : మండలంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మంగళవారం టీడీపీ నాయకులు మరియు రైతు సంఘం నాయకులు మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ కు వినంతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయాధికారి ఆనంద్ లోకదళ్ మాట్లాడుతూ పత్తి సాగు చేసిన రైతులకు కనీస మద్దతు ధర రూ.8110/- సిసిఐ సెంటర్లలో అమ్ముకోవచ్చని చెప్పారు. పత్తిలో తేమ శాతం పెరిగితే మద్దతు ధర తగ్గుతుందన్నారు.అలాగే మండలంలో ఇప్పటివరకు క్రాప్ బుకింగ్ ప్రకారం 36685 ఎకరాల్లో పత్తి సాగు అయిందన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ పంపాపతి రమేష్ రెడ్డి అయ్యప్ప రెడ్డి వార్డ్ సభ్యుడు శంకర్ కృష్ణయ్య ఎర్రి స్వామి కుంబార్ సురేష్ వీరేష్ బసవరాజు ఏఈఓ విరూపాక్షి,అగ్రికల్చర్ అసిస్టెంట్లు,కూటమి పార్టీ నాయకులు,రైతులు తదితరులు పాల్గొన్నారు.

Authors

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS