విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి:  సూర్య ప్రతాప్ 

విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి: సూర్య ప్రతాప్ 

డోన్ న్యూస్ వెలుగు : డోన్ నియోజవర్గ ఎమ్మెల్యే కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డి  ప్రజా సమస్యల పరిష్కార వేదికను గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేయగా విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ AISF ఆధ్వర్యంలో ఎమ్మెల్యే  కి వినతిపత్రం సమర్పించడం జరిగిందని జిల్లా కార్యదర్శి సూర్య ప్రతాప్  తెలిపారు .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ’ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ SC,BC హాస్టల్ విద్యార్థులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యలు,మరుగుదొడ్లు సమస్యలను పరిష్కరించాలని,డోన్ నియోజవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత లేని భోజనం విద్యార్థులకు అందిస్తున్నట్లు ఎమ్మెల్యేకు వివరించినట్లు వెల్లడించారు. విద్యార్డులకు  పౌష్టికాహారాన్ని అందించాలని, తాగునీటి,మరుగుదొడ్లు నిర్మాణము చేపట్టాలని, విద్యార్థులకు మంచినీటిని అందించడం కోసం RO ప్లాంట్లు ప్రభుత్వం కేటాయించగా వాటికి రిపేర్ల పేర్లతో,వాటర్ కనెక్షన్ లేక పక్కకు పడేశారన్నారు.  తక్షణమే ఆర్ ఓ  ప్లాంట్ల  సమస్యను పరిష్కరించాలని,బేతంచర్ల మండలంలోని సిమెంట్ నగర్ ప్రభుత్వ హైస్కూల్ కు మాథ్స్ టీచర్ లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని 10 వ తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలకు ఏవిధంగా చదువుకొని పరీక్షకు సిద్ధమవుతారని ఆయన ప్రశ్నించారు. కావున వారికి మ్యాథ్స్ టీచర్ ను ఏర్పాటు చేయాలని, డోను పట్టణంలోని కొత్తపేట హైస్కూల్ కు పోలీసువారి స్థలాన్ని ఆట స్థలంగా కేటాయించి వారికి ఆడుకోవడానికి అవకాశం కల్పించాలని, నాణ్యమైన చిక్కీలు విద్యార్థులకు ఇవ్వడం లేదని, పట్టణంలోని మోడల్ స్కూల్ కు పిటి మాస్టర్ లేక విద్యార్థులు క్రీడలకు దూరం అవుతున్నారు. కావున.వారికి వీటిని మాస్టర్ కేటాయించాలని,ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి వారంలో ప్రభుత్వ హాస్పిటల్ నుంచి వెళ్లి వారి హెల్త్ ను చెక్ అప్ చేయాలని, కొత్తపల్లి గ్రామం ప్రభుత్వ హైస్కూల్ దగ్గరగా ఉండే వైన్ షాపు, పట్టణంలోని శ్రీ సుధా జూనియర్ కళాశాల దగ్గరకు ఉన్న వైన్ షాపులు ఎత్తివేయాలని.. పలు సమస్యల పైన ఎమ్మెల్యే  దృష్టికి తీసుకెళ్ళినట్లు  తెలిపారు. ఈ కార్యక్రమంలో AISF జిల్లా ఉపాధ్యక్షుడు ప్రవీణ్, మండల ఉపాధ్యక్షులు అస్లాం,ధనుష్, నాయకులు మా భాష, మహేష్, జయరాజ్, అక్రమ్, రాజు, తదితర విద్యార్థులు పాల్గొన్నారు..

Author

Was this helpful?

Thanks for your feedback!