విద్యార్దులు శాస్త్రీయంగా ఆలోచించలి : శ్రీరాములు

విద్యార్దులు శాస్త్రీయంగా ఆలోచించలి : శ్రీరాములు

జమ్మలమడుగు టౌన్ (న్యూస్ వెలుగు ):  జనవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో జమ్మలమడుగు పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయంలో మండల స్థాయి చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ 8, 9, 10 తరగతుల విద్యార్థులకు చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరిగింది.20 పాఠశాలల విద్యార్థులు, మండల స్థాయిలో  50 మంది పరీక్షకు హాజరైనట్లు జిల్లా నాయకులు శ్రీరాములు తెలిపారు.  ఎంతో ఉత్సాహంతో విద్యార్థులు చెకుముకి టాలెంట్ టెస్ట్ కు సంసిద్ధులై పరీక్ష కు హాజరయ్యారని వారు అన్నారు.

జన విజ్ఞాన వేదిక జిల్లా నాయకులు శ్రీరాములు మాట్లాడుతూ విద్యార్థులు పాఠ్యపుస్తకాలే కాకుండా సమాజంలో జరిగే మార్పును గమనించాలిని అన్నారు.  అలాగే ప్రపంచవ్యాప్తంగా,జరుగుతున్న పరిణామాలను విద్యార్దులు గమనించి మసులుకోవాళ్ళన్నారు.  ప్రతి విద్యార్థి శాస్త్రీయంగా ఆలోచించి తెలుసుకోవాలని ఆయన సూచించారు. మండల స్థాయిలో గెలుపొందిన గీతాంజలి హై స్కూల్ విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేయడం జరిగిందన్నారు. గెలుపొందిన విద్యార్థులు జిల్లా స్థాయిలో జరిగే జన విజ్ఞాన వేదిక జిల్లా స్థాయి సైన్స్ టాలెంట్ టెస్ట్ కు వెళ్తనున్నట్లు తెలిపారు. జన విజ్ఞాన వేదిక జమ్మలమడుగు మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర, మోహన్ రెడ్డి , సుబ్బయ్య ,కళాందర్ ,విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS