
వివాహ వేడుకకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
తుగ్గలి న్యూస్ వెలుగు : తుగ్గలి మండల పరిధిలోని గల జొన్నగిరి గ్రామానికి చెందిన గుంతా వారి వివాహ వేడుకలకు పత్తికొండ మాజీ శాసనసభ్యురాలు కంగాటి శ్రీదేవి శుక్రవారం రోజున హాజరయ్యారు. వివాహ కార్యక్రమానికి హాజరైన మాజీ ఎమ్మెల్యే కంగ్రాటి శ్రీదేవిను గుంతా లక్ష్మి, గుంత పెద్ద ఆంజనేయులు,మాజీ విద్యా కమిటీ చైర్మన్ గుంత రఘు,మాజీ వాల్మీకి కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గుంతాదేవి లు మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి కు ఘనంగా స్వాగతం పలికి గజమాలతో ఘనంగా సన్మానించారు.వివాహ వేడుకలకు హాజరైన వైఎస్ఆర్సిపి నాయకులను వారు శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ కేడీసీసీ చైర్మన్ రామచంద్ర రెడ్డి,మాజీ ఎంపీపీ ఎర్ర నాగప్ప,రైతు విభాగ రాష్ట్ర కార్యదర్శి తుగ్గలి శ్రీనివాసరెడ్డి, వాలంటీర్ల విభాగ జిల్లా అధ్యక్షులు శభాష్ పురం హనుమంతు, నియోజకవర్గ ఐటీ వింగ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి,తుగ్గలి మోహన్ రెడ్డి, శ్రీరంగడు,రాతన మోహన్ రెడ్డి, టిఎండి హుస్సేన్,ఎర్రగుడి రామచంద్ర రెడ్డి,కారం భాస్కర్ రెడ్డి తదితర వైఎస్ఆర్సిపి నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.