
విశాఖలో ఏఐ యూనివర్సిటీ: లోకేశ్
విశాఖపట్నం, న్యూస్ వెలుగు : విశాఖలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వర్సిటీని ఏర్పాటు చేస్తామని, దానిని ప్రపంచస్థాయికి తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఐటీ మంత్రి లోకేశ్ ప్రకటించారు. రోబోటిక్స్, హెల్త్ కేర్, విద్యా రంగాలతో ఐటీని అనుసంధానం చేస్తామని చెప్పారు. ఏపీ ఐటీ అసోసియేషన్ ప్రతినిధులతో విశాఖపట్నం నోవాటెల్‌లో గురువారం రాత్రి ఆయన సమావేశమయ్యారు. అనంతరం మాట్లాడుతూ విశాఖపట్నాన్ని 100 బిలియన్ డాలర్ల ఎకానమీ నగరంగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. టాప్ టెన్ ఐటీ కంపెనీలను రాష్ట్రానికి రప్పిస్తామన్నారు. ఐటీ అభివృద్ధికి పునాదులు వేసిన చంద్రబాబును ఇకపై 4.0 వెర్షన్‌లో చూడబోతున్నామన్నారు.
Was this helpful?
Thanks for your feedback!