
వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు
తాడేపల్లి (న్యూస్ వెలుగు ): వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా లేళ్ళ అప్పిరెడ్డి, ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ పొట్టిశ్రీరాములు నిరాహారదీక్షను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదని, ఆంధ్రరాష్ట్ర అవతరణ కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప మహనీయుడు. ఆయన స్పూర్తిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకుందని ఆయన అన్నారు. నాడు వైయస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరు పెట్టారని, జగన్ సీఎం అయిన తర్వాత ఆ మహానుభావుడి సేవలు భావితరాలకు గుర్తుండాలని ఆంధ్ర రాష్ట్ర అవతరణను తిరిగి నవంబర్ 1న జరపాలని నిర్ణయించి, గత ప్రభుత్వం ఘనంగా నిర్వహించిందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొట్టిశ్రీరాములు స్పూర్తిని, ఆశయాలను కొనసాగిస్తూ ముందుకు సాగుతుందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు.
పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర అవతరణ జరిగింది, కానీ దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని పక్కనపెట్టిందన్నారు. కానీ ఆ తర్వాత జగన్ సీఎం అయిన తర్వాత నవంబర్ 1న అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారని ఆయన గుర్తు చేశారు.

