
వైసీపీ పార్టీ కార్యాలయం పై దాడి ఫర్నిచర్ ధ్వంసం
శ్రీ సత్యసాయి జిల్లా న్యూస్ వెలుగు : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోప్రజలను భయభ్రాంతులకు గురి అయ్యేలా టిడిపి నాయకులు వ్యవహరిస్తున్నారని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ హిందూపురం నియోజకవర్గం లోని వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం పై జరిగిన దాడిని ఖండిస్తూ ఆమె మండిపడ్డారు. పార్టీ కార్యాలయాన్ని పార్టీలోని ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం పిరికిపంద చర్య అని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. రోజురోజుకీ వైయస్సార్సీపి ప్రజల ఆదరణ, అభిమానం పొందుతున్నారనే.. నెపంతోనే ఇలాంటి దూర్చార్యాలకు టిడిపి శ్రేణులు పాల్పడుతున్నారని ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి దాడులను ప్రజలు గమనిస్తున్నారని వారు అన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆకృత్యాలను, అరాచకాలను వైయస్సార్సీపి పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు బహిర్గతం చేస్తున్నారని నెపంతో ఈ దాడులకు తెగబడ్డారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న టిడిపి శ్రేణులపైన నాయకుల పైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆమె ప్రభుత్వాన్ని పోలీసు అధికారులని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్న స్థానికంగా ఉన్న పోలీసులు కానీ జిల్లా ఎస్పీ కానీ ఎందుకు స్పందించలేదని వారు నిలదీశారు.

పోలీసు యంత్రాంగం అధికారులు కూటమి ప్రభుత్వానికి వత్తాసు పలకడమే కాకుండా వారికి కొవ్వట్టులుగా మారారని వైయస్సార్సీపి నాయకుల పైన కార్యకర్తల పైన వారి ఆస్తులపైన ధ్వంసం చేసిన దాడులు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని వారు బహిరంగంగా ప్రశ్నించారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటనలో భాగంగా ఇలాంటి దాడులు చేయటం దేనికి సంకేతం అన్నారు. ఇలాంటి దాడులకు వైసీపీ నాయకులు ఎవరూ భయపడబోరని వారు అన్నారు. వైయస్సార్సీపి పార్టీ కార్యాలయం పై దాడి చేసిన వారిని శిక్షించాలన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నట్లు వారు తెలిపారు.

