
సంతకాల సేకరణలో పాల్గొన్న ఎమ్మెల్యే
హొళగుంద (న్యూస్ వెలుగు ):మండలం పరిధిలోని హెబ్బటం,పెద్ద గోనెహల్,ఇంగళదహల్ గ్రామలలో శనివారం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి కోటి సంతకాల సేకరణ రచ్చ బండ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఇంటి వద్దకే సేవలు అందించడనికి వాలంటీర్స్ వ్యవస్థ ను ఏర్పాటు చేశారు.కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజలు సచివాలయం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందన్నారు.మరియు ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా హొళగుంద ఢణపురం రోడ్డు అధ్వానంగా ఉందని రోడ్డు వేయాలని జిల్లా అధికారులకు పలుమార్లు వినతి పత్రం మరియు ధర్నాలు చేసిన కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటికరణ చేస్తూ పేదలకు వైద్యం అందకుండా చేస్తున్నారు.పీపీపీ విధానాన్ని రద్దు చేసేందుకే కోటిసంతకాల సేకరణ చేస్తున్నామన్నారు.కేంద్రం ప్రభుత్వం,ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయకూడదని చెప్పిందని తెలిపారు. ఇంగ్లాదహాల్ గ్రామంలో ఎమ్మెల్యేకు ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పువ్వులతో ఘనసాగరం పలికారు ఈ కార్యక్రమంలో వైసీపీ మండల కన్వీనర్ షఫీఉల్లా,ఎంపీటీసీ మల్లికార్జున,జిల్లా ఉపాధ్యక్షులు గిరి,జడ్పీటీసీ వైస్ చైర్మన్ బావ శేషప్ప,కో కన్వీనర్ లక్ష్మన్న,సర్పంచ్ కొత్తింటి వెంకటరెడ్డి,వెంకటరామిరెడ్డి,వైసీపీ నాయకులు ఆనంద్,గిరి,శీను,భూషణ్ రెడ్డి,గోవిందు,శంకర్,మల్లికార్జున రెడ్డి,సోషల్ మీడియా అధ్యక్షులు మౌనిష,శంభు లింగ,వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.





