
సమస్యలు పరిస్కరిస్తాం: కలెక్టర్
సమస్యలు పరిస్కరిస్తాం: కలెక్టర
కర్నూలు(న్యూస్ వెలుగు): ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి,మెడికల్ కాలేజ్ లలో ఉన్న సమస్యలు తీరుస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పేర్కొన్నారు. బుధవారం సాయంకాలం మెడికల్ కాలేజ్ సమావేశ మందిరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి మరియు మెడికల్ కాలేజ్ అన్ని వైద్య విభాగాల అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి, అన్ని వైద్య విభాగాలలో ఉన్న సమస్యలను, వసతులు, పరికరాల లభ్యత తదితర విషయాల గురించి కూలంకషంగా అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ…ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో అవసరమైన వైద్య పరికరాలు, సిబ్బంది నియామకాలు, వసతులు ఏర్పాటు చేయటానికి అన్ని చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి.భరత్ సహకారంతో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఆరోగ్య శాఖ మంత్రి, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ తో చర్చించి సమస్యలన్నీ పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. క్యాన్సర్ ఆసుపత్రి ఆపరేషన్ థియేటర్లను ఇంకా పూర్తి చేయకపోవడాన్ని కాంట్రాక్టర్ ను ప్రశ్నించి, త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా పరిధిలో ఉన్న పనులను పెండింగ్ లో ఉంచకూడదని కలెక్టర్ ఆదేశించారు. సిఎస్ ఆర్ కింద కూడా వీలైనన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఎన్టీఆర్ వైద్య సేవ చేస్తున్న విధానం, వారి సిబ్బంది విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ కింద కేసులను పెంచాలని కలెక్టర్ డాక్టర్లను ఆదేశించారు. ఆసుపత్రిలో అనస్తీసియా విభాగానికి డాక్టర్ల కొరత ఉన్నదన్న విషయం కలెక్టర్ దృష్టికి తీసుకుని రాగా, అవసరమైతే స్థానికంగా ఉండే అనస్థీషియా డాక్టర్లను ఉపయోగించుకునేందుకు వీలవుతుందేమో అని ఉన్నతాధికారులతో చర్చిస్తామన్నారు. 24 గంటలు ఒక రేడియాలజిస్ట్ డ్యూటీలో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గైనకాలజీ విభాగంలో కోతుల సమస్య ఉన్నదని తెలుపగా, అందుకోసం మెష్ ఏర్పాటు చేసే చర్యలు వెంటనే తీసుకోవాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. అన్ని విభాగాల వైద్యాధికారులు పరస్పరం సమిష్టిగా సహకరించుకొని, ప్రజలకు మంచి వైద్య సేవలు అందించాలని డాక్టర్లను జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
దాపు అన్ని వైద్య విభాగాల అధికారులు మెడిసిన్ , ఆర్తో, పీడియాట్రిక్, ఇఎన్టి ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, యూరాలజీ నియోనాట లాజి, నెఫ్రాలజీ , ఎండ్రోక్యనాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ , యూరాలజీ , డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫిజియాలజీ , క్యాన్సర్ ఆస్పత్రిలో ఉన్న మెడికల్ ఆంకాలజీ సర్జికల్ అంకాలేజీ ,రేడియేషన్ తదితర విభాగాల హెడ్స్ వారికి అవసరమైన పరికరాలు, వసతులు, సిబ్బంది తదితర విషయాలను జిల్లా కలెక్టర్ కు వివరించారు. సమావేశంలో మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ ,జిజిహెచ్ సూపరిండెంట్ వెంకటేశ్వర్లు ,కంటి ఆసుపత్రి సూపరిండెంట్ వెంకటేశ్వర రెడ్డి, మెడికల్ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్ లు సాయి సుధీర్, డాక్టర్ హరి చరణ్, జి జి హెచ్ అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం , అన్ని శాఖల హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ లు ప్రొఫెసర్లు, ఏపీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ ఇంజనీర్ లు , డాక్టర్లు పాల్గొన్నారు.

