
సారా స్థావారాలపై నిఘా ఉంచండి కర్నూలు జిల్లా డిప్యూటీ కమిషనర్
కర్నూలు (న్యూస్ వెలుగు): కర్నూలు మరియు నంద్యాల జిల్లాలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లతో నెల వారి నేర సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే సారా రహిత గ్రామాలుగా ప్రకటించిన గ్రామాలలో లో తిరిగి నాటు సారాయి తయారు కాకుండా నిఘా ఉంచాలని అధికారులను ఆదేశించారు. నాటు సారా మానివేసిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపించే మార్గాలు చూడాలని తెలిపారు.

అన్నమయ జిల్లా మొలకలు చెరువు స్టేషన్ పరిధిలో మరియు విజయవాడ లోని ఇబ్రహీంపట్నం పట్టుబడిన నకిలీ మద్యం ను దృష్టిలో ఉంచుకుని తనిఖీలు ముమ్మరం చేయాలని, పాత కేసు లోని ముద్దాయి లు అందరినీ బైండ్ ఓవర్ లు చేసి, వారి ప్రస్తుత కార్యకలాపాల పై నిఘా ఉంచాలని, పొరుగు రాష్ట్రాల మద్యం జిల్లాలో కి ప్రవేశించకుండా నిరంతరం దాడులు కొనసాగాలని ఆదేశించారు.
పొరుగు రాష్ట్రాల మద్యం కేసుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జ్ షీట్ కోర్టు కు సమర్పించాలని ఆదేశించారు. ఈ రివ్యూ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ రావిపాటి హనుమంతరావు కర్నూలు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి మచ్చ సుధీర్ బాబు గారు ,అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ లు, డి రామకృష్ణారెడ్డి, మరియు రాజశేఖర్ గౌడ్ లు మరియు కర్నూలు మరియు నంద్యాల జిల్లా ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు అందరూ పాల్గొన్నారు.