
సిఐఐ సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి
ఢిల్లీ ( న్యూస్ వెలుగు) ఢిల్లీలో మంగళవారం జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు కర్టైన్ రైజర్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అపారమైన అవకాశాలను గురించి వివరించారు. అనంతరం పలుదేశాలకు చెందిన వ్యాపారవేత్తలతో సంభాషించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు అన్ని రకాలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో నేడు పర్యటన చేస్తున్న సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సిఐఐ సదస్సులో ఆయన ప్రత్యేకించి మాట్లాడారు. పరిశ్రమల ఏర్పాటు కావలసిన అన్ని మొళిక సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం సమకూరుస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు సిఐఐ సదస్సులో వివరించారు.
Was this helpful?
Thanks for your feedback!