
సిద్దేశ్వర ఆలయంలో ఘనంగా కార్తీక పౌర్ణమి వేడుకలు
వెల్దుర్తి (న్యూస్ వెలుగు) : కర్నూలు జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో శ్రీ శ్రీ సిద్దేశ్వర ఈశ్వరలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలు ఘనంగా నిరసించినట్లు ఆలయ ధర్మకర్త ఎల్ ఈ దామోదర్ గౌడ్ తెలిపారు. కార్తీక మాసాన భక్తుల రద్దీ నిమిత్తం ఏర్పాట్లు పెద్ద ఎత్తున నిర్వహించినట్లు వారు వెల్లడించారు. దేవాలయంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వారు పేర్కొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు శివ స్వాములకు అన్నదాన కార్యక్రమాలను నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలను నిర్వహించేందుకు ఆలయ ధర్మకర్త దామోదర్ గౌడ్, మహేష్ గౌడ్ ఆలయ పూజారి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్లు తెలిపారు.

Was this helpful?
Thanks for your feedback!

