సీఎం ఇలాకాలో మహిళలకు రక్షణ ఎక్కడ : వైఎస్ షర్మిల

సీఎం ఇలాకాలో మహిళలకు రక్షణ ఎక్కడ : వైఎస్ షర్మిల

న్యూస్ వెలుగు కుప్పం : అప్పు తీర్చలేదని కుప్పంలో ఓ మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేయడం అమానుషమని ఏపి PCC అధ్యక్షురాలు షర్మిల అన్నారు. సభ్య సమాజం తల దించుకొనే దుశ్చర్యం  ఇదన్నారు. కన్న కొడుకు ముందే తల్లికి జరిగిన ఘోర అవమానం ఇదని ఆమె అన్నారు . సాటి మహిళగా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ఘటనపై  చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలుగింటి ఆడపడుచుకి సీఎం ఇలాకాలోనే రక్షణ లేదు అనడానికి ఈ సంఘటనే నిదర్శనం మన్నారు వై ఎస్ షర్మిల .  చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనే ధైర్యం కుప్పంలో చంద్రబాబు  ఇచ్చారా ? లేక మహిళా హోంమంత్రి  ఇచ్చారా ? అని  ప్రశించారు . మహిళల మీద ఇలాంటి దాడులు జరగడం కూటమి ప్రభుత్వానికి సిగ్గుచేటని విమర్శించారు. ఆడపడుచుల పక్షపాతి అని, తెలుగింటి ఆడపడుచుల పార్టీ అని తెలుగుదేశం పార్టీ  గొప్పలు చెప్పుకోవడం విచారకరం అన్నారు.

Author

Was this helpful?

Thanks for your feedback!

COMMENTS