అమరావతి న్యూస్ వెలుగు :

వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం నాడు నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస కళ్యాణానికి ఆహ్వానించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ శ్రీ బీ ఆర్ నాయుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనతో బాటు టీటీడీ కార్యనిర్వహణాధికారి జె. శ్యామలరావు, సంయుక్త కార్యనిర్వహణాధికారి వెంకన్న చౌదరి, బోర్డు సభ్యులు కూడా ఉన్నారు. శ్రీ శ్రీనివాస కళ్యాణ ఆహ్వాన పత్రాన్ని వారు సీఎంకు అందచేశారు.
Thanks for your feedback!