స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించండి : సిపిఐ
నంద్యాల : తంగడంచ ఫారం భూములలో కేంద్రియ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలి.. జైన్ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించి స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి.. గిరిజనులకు ఇళ్లస్థలాలకై ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేయాలి.. నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, శాసనసభ్యులు గిత్త జయసూర్య లకి సిపిఐ వినతి అందించినట్లు తెలిపారు . దేశంలోనే నల్లరేగడి గల ప్రభుత్వ భూములు మేలు రకమైన వంగడాలు పండించే తంగడంచ రాష్ట్ర విత్తన ఉత్పత్తి 1616ఎకరాల వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయ అభివృద్ధిలో భాగంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసి ఈ ప్రాంత నిరుద్యోగులకు రైతులకు ప్రజలకు ఉపాధి కల్పించాలని, ఏడు సంవత్సరాల క్రితం ప్రారంభించిన జైన్ పరిశ్రమ గత ఐదు సంవత్సరాల పాలనలో అభివృద్ధి చెందలేదని ఇప్పుడైనా జైన్ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించి స్థానిక నిరుద్యోగులకు 2015 ప్రారంభం లో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఇచ్చిన హామీ మేరకు 75% స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని,, 80 బన్నూరు,సిద్దేశ్వరం గ్రామ గిరిజనులకు ప్రత్యేక కాలనీ ఏర్పాటు చేసి వారికి ఇళ్ల స్థలాలు పక్కా గృహాలు నిర్మించాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గనియ, నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త జయ సూర్య గారికి సిపిఐ ఆధ్వర్యంలో సీపీఐ జిల్లా నాయకులు ఎం.రమేష్ బాబు వినతిపత్రం అందించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల నాయకులు నరసింహ పుల్లయ్య రాజు మధు గిరిజన సంఘం నాయకులు బాలకృష్ణ వెంకటేశ్వర్లు అధిక సంఖ్యలో గిరిజన మహిళలు పాల్గొన్నారు..